logo

యుపిఎస్‌ బ్యాటరీ పేలి తల్లి కొడుకులు సజీవదహనం


09-Oct-2019 16:50IST
son and mother died because of ups battery blast in chitoor

విజయదశమి రోజున చిత్తూరులో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ అయ్యి తల్లి కొడుకులు సజీవదహనం అయిన ఘటన చిత్తూరు జిల్లా పాకాల లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే  పాకాల మండలం గానుగపెంట పంచాయతీ కూనపల్లి గ్రామంలో శంకరమ్మ , కొడుకు శేఖర్ తో కలిసి నివసిస్తుంది. మంగళవారం దసరా వేడుకలను బంధుమిత్రులతో జరుపుకున్నారు. 
Image result for ups blast
మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో వారు నిద్రిస్తుండగా యుపిఎస్‌ బ్యాటరీ పేలుడు సంభవించి అగ్ని మంటలు వ్యాపించాయి. కాగా, తల్లీ కొడుకులు ప్రమాదాన్ని గమనించేలోగానే పూర్తిగా మంటలు వ్యాపించడంతో ఆ మంటల్లో తల్లి , కొడుకులు సజీవ దహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ జరగడం..ఒక్కసారే మంటలు వ్యాపించడం వలన వారు బయటికి రాలేక మంటల్లో  ఆహుతయ్యాయి ఉంటారని స్థానికులు తెలుపుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: son and mother died ups battery blast chittoor

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top