logo

ప్రధాని సొంత రాష్ట్రంలో మతమార్పిడులు


09-Oct-2019 17:36IST
religion conversions in gujarath

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ లో సుమారు 500 మంది దళితులు, మతం మార్చుకొని బుద్ధిజం తీసుకున్నారు. మంగళవారం నాడు విజయదశమి రోజునే ఈ సంఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమర్కంత జిల్లాలోని మెహ్సన అనే ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో 500 మంది దళితులు, హిందూ మతాన్ని వదులుకుని బౌద్ధమతాన్ని స్వీకరించారని జిబిఎ కార్యదర్శి రమేష్ బంకర్ తెలిపారు.
మతమార్పిడి జరిగిన 500 మందిలో అమ్రావాడి ప్రాంతానికి చెందిన వందన పర్మార్ అనే యువతి, తన తల్లిదండ్రులు సోదరుడితో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఈమె ఆధ్వర్యంలోనే ఈ తతంగం అంతా జరిగినట్టు సమాచారం. "ఈ మధ్య కాలంలో బౌద్ధమతం, డాక్టర్ అంబేద్కర్‌ల భావజాలం నుంచి మేము ప్రభావితమయ్యాము. అంబేద్కర్ చూపించిన బౌద్ధమతం, సమానత్వం, శాస్త్రీయ స్వబావాలకు ఆకర్షితులమయ్యే తాము ఈ ‘దీక్ష’ తీసుకున్నాము” అని ఆమె చెప్పారు. అయితే బుద్దిస్టులు విజయదశమిని అశోక విజయదశమిగా జరుపుకోవడం విశేషం. 

Tags: caste conversions dalith to buddism gujarath vijayadashami

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top