logo

దసరా సెలవులు పొడిగించే యోచనలో సర్కార్...!


09-Oct-2019 18:24IST
dasara holidays for schools to be extended in telangana

టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో... విద్యాసంస్థలకు గతంలో కేటాయించిన దసరా సెలవులను మరో రెండు రోజుల పాటు పొడిగించాలని, సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో, పండగ జరుపుకునేందుకు స్వస్థలాలకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యేందుకు బస్సుల కొరత ఏర్పడటంతో... ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అలాగే, విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తే, ఆ బస్సులను కూడా ప్రజా రవాణాకు ఉపయోగించుకోవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. స్వస్థలాలకు వెళ్ళిన వారు మరో రెండు మూడు రోజుల్లో తిరుగుప్రయాణం అయ్యే అవకాశం ఉండటం కూడా ప్రభుత్వ నిర్ణయానికి ఒక కారణంగా తెలుస్తోంది. 

Tags: dasara holidays extension schools telangana tsrtc strike

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top