logo

ఇక నుంచి జియో నుంచి కాల్ చేయాలంటే రీచార్జ్ చేయాల్సిందే...


09-Oct-2019 18:47IST
recharge to be done for outgoing calls from now onwards

టెలికాం దిగ్గజంగా పేరుపొందిన రిలయన్స్ జియో సంస్థ, తమ వినియోగదారులకు ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది. సాధారణంగా కంపెనీలు పండగ ఆఫర్ల కింద వినియోగదారులకు రాయితీలను ప్రకటిస్తూ ఉంటాయి. కానీ జియో మాత్రం, తాజాగా ప్రకటనతో... వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా రీచార్జ్ బాంబును పేల్చింది. ఇక నుంచి జియో నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్ నంబర్లకు ఫోన్ చేస్తే, ప్రతి నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. 
అయితే.. ఎంత వసూలు చేస్తారో అంత మొత్తానికి తగిన డేటాను నష్ట పరిహారం తరహాలో ఉచితంగా ఇస్తామని జియో ప్రకటించింది. గురువారం నుంచి ఈ చార్జీలు అమలు కానున్నట్లు తెలిసింది. ఇక నుంచి జియో యూజర్లు ఇతర నెట్‌వర్క్ వినియోగదారులకు ఔట్‌గోయింగ్ కాల్స్ చేయాలంటే రీచార్జ్ చేసుకునే సమయంలో అదనంగా ఐయూసీ టాప్ అప్ వోచర్‌ను కూడా కొనుగోలు చేయాలని సంస్థ తెలిపింది. దీంతో జియో వినియోగదారులు లబోదిబో మంటున్నారు. 

Tags: relience jio IUC top up recharge outgoing 1paisa per minute

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top