logo

అప్పుల్లో పాకిస్తాన్ టాప్...


09-Oct-2019 19:41IST
pakistan tops in debts

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే.. పాకిస్తాన్.. 8 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చింది. అందులో 2.8 లక్షల కోట్ల అప్పును, విదేశాల నుంచి తీసుకున్న పాక్... అత్యధిక అప్పులు చేసిన దేశంగా రికార్డు నెలకొల్పింది. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ ప్రస్తుత అప్పు 32 లక్షల 24 వేల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, తొలి రెండు నెలల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు 1.43 శాతం పెరిగినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
కాగా, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి.. పాకిస్తాన్.. చైనా శరణుజొచ్చింది. అటు చైనా కూడా పాక్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించటంతో, పాక్ కు కొంత ఊరట లభించినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన 8 దేశాల్లో, పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉన్నట్టు తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే, పాక్ ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణం... ఆ దేశ సైనిక అవసరాలే అని తెలుస్తోంది. 

Read latest International News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: pakistan tops in debts

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top