logo

రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిపై పడ్డ పిడుగు


09-Oct-2019 20:05IST
thunderbolt fell on man while walking on a road

టెక్సాస్‌లో రోడ్డుపై నడుస్తున్న ఓ వ్యక్తిపై పిడుగుపడింది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలడంతో, హుటాహుటిన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అతను ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. టెక్సాస్‌లోని ఒక పార్కు సమీపంలో అలెగ్జాండర్‌ కొరియస్‌ అనే వ్యక్తి, తన జాగిలాలతో కలసి నడుస్తున్నాడు. అదే సమయంలో అతడిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఈ ఘటనను గమనించిన కొందరు వ్యక్తులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్ళటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆసుపత్రి సిబ్బంది తొలుత గుండె స్పందనలు లేకపోవడాన్ని గమనించి, వెంటనే సీపీఆర్‌ (గుండె మర్థన) చేయటంతో అదృష్టవశాత్తూ అతని గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డా, అతని దేహంలోని అనేక భాగాల్లో ఎముకలు విరిగాయి. అయితే, నేరుగా పిడుగు పడినా, అలెగ్జాండర్‌ ప్రాణాలతో బయటపడటం విశేషం.

Read latest International News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: thunderbolt texas alexander courius

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top