logo

ఏసీబీ కస్టడీలోకి ఈఎస్ఐ స్కామ్ నిందితులు


09-Oct-2019 20:12IST
esi scam accused into acb custody

రాష్ట్రంలో సంచలనంగా  మారిన ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. ఈఎస్ఐ  స్కామ్ లో నిందితుల్ని కస్టడీలోకి తీసుకొనేందుకు ఏసీబీ కోర్టును అనుమతి కోరింది. దీంతో  రెండు రోజుల పాటు విచారణ నిర్వహించేందుకు ఏసీబీకి అనుమతి లభించింది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాని తో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత,  ఫార్మసీస్ట్ రాధిక, నాగరాజు,  హర్షవర్ధన్, ఎండి శ్రీహరిలను నేడు ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసు లో ఏసీబీ 13 మంది ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో మరి కొందర్ని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది.

Image result for esi scam, acb custody

Tags: esi scam acb custody

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top