logo

'హైదరాబాద్'ని ముంచెత్తిన భారీ వర్షాలు


09-Oct-2019 20:13IST
heavy rains at hyderabad

భాగ్యనగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం నగర పరిధిలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు తో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ పిడుగులతో కూడిన వర్షం ఇంకా రెండు రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నగరవాసులు సాధ్యమైనంత వరకు కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా అధికారులు ప్రజలను కోరారు. ఇక నగరంలో నీటి నిల్వలు, వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందుల గురుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ మీడియా తో మాట్లాడారు.  వరద నీరు నిలిచిన చోట మ్యాన్‌హోల్స్ ఒపెన్ చేసే ప్రయత్నం చేయవద్దని, జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని కోరారు. ఇంకా గుంతలలో నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 
Image result for heavy rains, hyderabad

Tags: heavy rains hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top