logo

బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న 'వార్' కలెక్షన్లు


09-Oct-2019 20:14IST
war movie collections hits box office

హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ వార్ సినిమా అక్టోబర్ 2 న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  భారీ బడ్జెట్‌, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే నెలకొన్నాయి. బాలీవుడ్ లో 'సైరా' తో ఢీకొన్న వార్ మంచి సక్సెస్ సాధించిందనే చెప్పాలి. 

దుర్గా పూజ, దసరా సందర్భంగా భారీ వారాంతం కలిసిరావడంతో ఈ మూవీ వసూళ్లు దండిగానే రాబట్టింది. మొదటి వారం తర్వాత   ఇండియాలోనే ఏకంగా రూ.52 కోట్ల నెట్ వసూళ్లతో సంచలనం సృష్టించిందీ చిత్రం. ఈ సంవత్సరం లో ఇంతవరకు బాలీవుడ్‌ నుంచి మూడు వందల కోట్ల నెట్‌ వసూలు చేసిన సినిమా రాలేదు. ఆ లోటుని వార్‌ తీర్చేయనుందని అర్దమవుతోంది. 

Image result for war collections
ఐదు రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్లో వార్ మూవీ ఏకంగా రూ.166.25 కోట్లు కొల్లగొట్టింది. హిందీ , తమిళ్‌, తెలుగు వెర్షన్‌లను కలుపుకుని దేశవ్యాప్తంగా రూ. 215 కోట్లు కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రూ. 200 కోట్ల వసూళ్లు దాటిన వార్‌ కలెక్షన్లు ఇంకా నిలకడగా ఉండటంతో ముందుముందు సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని భావిస్తున్నారు. 

Tags: war movie collections box office

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top