logo

ఆలయాల్లో చోరీ చేసే ముఠా అరెస్ట్


09-Oct-2019 20:16IST
thiefs in temples

దేవాలయాలే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నరసింహ, సారయ్య, రమేష్, జగదీష్ లు జల్సాలకు అలవాటుపడి చోరీలు చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ కు మకాం మార్చిన వీరు భద్రతలేని ఆలయాలే లక్ష్యంగా చేసుకొని హుండీలు పగలగొట్టి నగదు, బంగారం దోచుకెళ్లేవారు. 

Image result for thiefs in temples

ఇలాంటి చోరీలకు పాల్పడే వారిపై నిఘా పెట్టిన ఎల్బీనగర్ పోలీసులు చాకచక్యంగా నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 వేల నగదు, బంగారు ఆభరణాలు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీ నగర్ ఏసీపీ రవీందర్ తెలిపారు. వీరిపై మొత్తం 11 కేసులు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను ఈ సందర్భంగా ఏసీపీ అభినందించారు.

Tags: thiefs temple

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top