logo

'సైనా' లా ఆడేందుకు చాలానే శ్రమిస్తుందే ..


09-Oct-2019 20:20IST
parinithi chopra wants to be saina nehwal

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చుసిన బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖుల కథలను వెండి తెరమీద ఆవిష్కరించి ప్రేక్షుకుల ఆధారాభిమానులను పొందుతున్నారు దర్శకులు. ఇక వీరి తో పాటు ఇప్పుడు క్రీడాకారుల బయోపిక్ లకు సిద్ధం అవుతున్నాయి. పుల్లెల గోపీచంద్ , సానియా,  సైనాలా బయోపిక్ పైనా అందరికీ ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం సుధీర్ బాబు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. 

ఇక సైనా బయోపిక్ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. అమోల్ గుప్తా దర్శకత్వంలో టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ బయోపిక్ గురించి చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నా కొన్ని కారణాల వలన వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందు సైనా పాత్రకు శ్రద్ద కపూర్ ని అనుకున్నారు చిత్ర నిర్మాతలు. దానికి తగ్గట్టే ఆమె కొన్ని రోజులు బ్యాడ్మింటన్ లో శిక్షణ కూడా తీసుకుంది శ్రద్దా.  

Image result for parineeti chopra saina nehwal

కానీ నిర్మాతలతో వచ్చిన విబేధాల వలన ఆమె ప్లేస్ లో పరిణితి చోప్రా వచ్చి చేరింది. ఇక ఈమె ఇప్పుడు బ్యాడ్మింటన్ నేర్చుకుంటూ బాగా కష్టపడుతుంది.  బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తూ అచ్చం సైనాలా ఆడేందుకు చాలానే శ్రమిస్తోంది. తాజాగా థానే బ్యాడ్మింటన్ అకాడెమీలో చెమటలు చిందిస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. మరి ఈ బయోపిక్ లో  పరిణితి సైనాను మరిపిస్తుందో లేదో చూడాలి. 

Tags: parineeti chopra saina nehwal biopic

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top