logo

'సీనయ్య' కు క్లాప్ కొట్టిన దర్శకేంద్రుడు


09-Oct-2019 20:22IST
ragavendra claps to sinayya movie

మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం సీనయ్య. దిల్ రాజు సమర్పణలో అసుర ఫేమ్ నరసింహ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మంగళవారం దసరా పండగని పురస్కరించుకొని   సీనయ్య ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన చిత్ర బృందం బుధవారం వినాయక్ పుట్టినరోజు  సందర్భంగా పూజ కార్యక్రమాలను నిర్వహించింది. హైదరాబాదులో జరిగిన ఈ పూజ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా పాల్గొని వినాయక్ పై క్లాప్ కొట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హాజరైంది.1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్‌ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. త్వరలోనే మిగతా పాత్రల వివరాలు వెల్లడిస్తామని , నేటి నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ దర్శకులు , చిత్ర బృందం , తదితరులు పాల్గొన్నారు.
Image result for raghavendra, sinayya movie, vv vinayak 

Tags: raghavendra sinayya movie vv vinayak

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top