logo

టూరిజం ప్యాకేజీలో విశాఖ 'జూ'


09-Oct-2019 20:23IST
Visakha zoo in tourism package

సెల్ టవర్ల రేడియేషన్ కారణంగా అనేక పక్షులు అంతరించి పోతున్నాయని ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలోని జూని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టూరిజం ప్యాకేజీ లో విశాఖ జూని కూడా చేర్చి ఇతర రాష్ట్రాల పర్యాటకులు వచ్చేవిధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. జూలో పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని.. అందుకు జంతు ప్రేమికులు కూడా సహకరించాలన్నారు. విశాఖ జూ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. జీవవైవిధ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరికీ ఉందని మంత్రి తెలిపారు. 
Image result for Visakha 'zoo' in tourism package

Tags: vishakhapatnam zoo

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top