logo

ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు..!


09-Oct-2019 21:10IST
tata motor launches tigore ev sedan car into indian market

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌... టిగోర్‌ ఈవీ (ఎలక్ట్రిక్‌ వెహకల్‌) సెడాన్‌ కారును విడుదలచేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.44 లక్షలు. ఎక్స్‌ఈ+, ఎక్స్‌ఎం+, ఎక్స్‌టి+ అనే మూడు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. ఇప్పటి వరకు టాటా మోటార్స్‌ సంస్థ, ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలను కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు, క్యాబ్‌ నిర్వాహకులకు మాత్రమే విక్రయించేది. ఇక నుంచి వ్యక్తిగత వినియోగదారులు కూడా ఈ వాహనాలను కొనుగోలుచేయవచ్చు అని కంపెనీ తెలిపింది.

ఈ కారు ప్రత్యేకతలు ఏంటంటే... అధిక ఉష్ణోగ్రతలలో కూడా స్థిరమైన ప్రదర్శన కోసం 21.5 కిలోవాట్ బ్యాటరీని కలిగి ఉండటం. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది గతంలో కంటే 71 కిలోమీటర్లు అదనం. ఇందులో రెండు ఛార్జింగ్‌ పోర్టులు ఉన్నాయి. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం ఒకటి, స్లో ఛార్జింగ్‌ కోసం మరొకటని కంపెనీ తెలిపింది. 
ఎక్స్‌ఈ+ వేరియంట్‌లో అయితే రెండు ఎయిర్‌బ్యాగులు అదనంగా ఉన్నాయి. మూడు వేరియంట్లలో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టంతో పాటు ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. వీటితో సిగ్నేచర్‌ ఈవీ డెకల్స్‌, ప్రీమియం ఫ్రంట్‌ గ్రిల్, స్టైలిష్‌ అలాయ్‌ వీల్స్‌, హైట్ అడ్జబుల్‌ సీట్‌, అర్మాన్‌ సౌండ్‌ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. లక్సరీ కార్లలో ఉండాల్సిన ఫీచర్లన్నీ టాటా సంస్థ వారు అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చారు.  

Read latest Technology News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: tata tigore ev sedan class tata motors launches indian market

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top