logo

ఉల్లి ఘాటు తగ్గిందనుకుంటే, టమాట ఎరుపెక్కింది...


09-Oct-2019 21:44IST
tomato cost highs in market

నిన్నమొన్నటి దాకా ఉల్లి ధరల ఘాటుకు ప్రజలు కంటతడి పెట్టారు, తాజాగా టమాట ఎరుపెక్కి ప్రజలను భయపెడుతోంది. టమాట దిగుబడులు అధికంగా ఉండే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా, బుధవారం దేశ రాజధానిలో కిలో టమాట రూ 80కి ఎగబాకింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో టమాట ధరకు రెక్కలొచ్చినట్లైంది. దీనికి తోడు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో, గత ఐదు రోజులుగా టమాట ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. 
రిటైల్‌ వర్తకులు టమాటాను రూ 60 నుంచి రూ 80 మధ్య విక్రయిస్తుండగా, మదర్‌డైరీ సఫల్‌ అవుట్‌లెట్లలో కిలో రూ 58కి విక్రయిస్తున్నారు. అక్టోబర్‌ 1న రూ 45 పలికిన కిలో టమాట బుధవారం సగటు రిటైల్‌ ధర రూ 54కు పెరిగిందని అధికారులు తెలిపారు. వరదలు, భారీ వర్షాలతో పంట దెబ్బతినడం, సరఫరా అవాంతరాలతో టమాట ధరలు మండుతున్నాయని ఆజాద్‌పూర్‌ మండిలో హోల్‌సేల్‌ ట్రేడర్‌ చెప్పుకొచ్చారు. ఇతర మెట్రో నగరాలు కోల్‌కతాలో కిలో టమాట రూ 60 కాగా, ముంబైలో రూ 54, చెన్నైలో రూ 40 వరకూ పలుకుతోంది. దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటం కూడా టమాట ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter 

Tags: tomato price market rain effect

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top