logo

టీటీడీ చైర్మన్ ఇంట్లో రాజకీయ తగాదా పరిష్కారం : వర్ల


10-Oct-2019 13:48IST
ttd chairman resolves political quarrel at home  varla ramaiah

తాడేపల్లిలో టీటీడీ దేవస్థానం చైర్మన్, వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో రాజకీయ పంచాయితీ జరిగిందంటూ వైసీపీ నేతల సమావేశంపై వర్ల రామయ్య విమర్శలు చేశారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో రామయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇటువంటి పంచాయితీ ఎప్పుడు జరగలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీడీఓ సరళ కేసు సరైన పోలీసు అధికారి చేతిలో పడితే శ్రీధర్ రెడ్డి జైల్లో ఉండేవారని అన్నారు. టీటీడీ చైర్మన్ ఇంట్లో రాజకీయ తగాదాలకు సంబందించిన చర్చలు ఎలా జరుగుతాయని వర్ల ప్రశ్నించారు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు వైసీపీ నాయకులూ కూడా దోచుకోవడానికి ఊర్లను పంచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
Image result for varla ramaiah

Tags: ttd chairman varla ramaiah

Advertisement
Advertisement
Top