logo

ఆమోస్ మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్


12-Oct-2019 09:58IST
minister srinivas goud paid tribute to amos body

గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ మల్కాజ్ గిరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా ఆమోస్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం   తెలియజేసారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఆమోస్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో తొలి దశ నుండి మలి దశ వరకు ఆమోస్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం చూడకుండానే చనిపోయారని... ఆమోస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని చూసి సంతోషించారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఆమోస్ కు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు మంత్రి ప్రకటించారు.

Read latest Telangana News and Online Telugu News
 | Follow us on FaceBookTwitter

Related image

Tags: minister srinivas goud amos' body

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top