logo

మిర్యాలగూడలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం


12-Oct-2019 10:35IST
commencement of central college at miryalguda

నల్గొండ జిల్లాలో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైంది. ఈ మేరకు  మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని జప్తివీరప్పగూడెం గ్రామపంచాయతీలో కేంద్రీయ విద్యాలయానికి చెందిన నూతన భవనాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హాజరైయ్యారు. కేంద్రీయ విద్యాలయంలో దేశ సంస్కృతిని ప్రతిబింభించే విధంగా ప్రమాణాలతో కూడిన విద్య అందించబడుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కావడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే తెలిపారు.

Tags: miryalguda

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top