logo

డివైడర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి


12-Oct-2019 11:24IST
3 members died in car accident

షాద్‌నగర్ మండలం బూర్గుల టోల్‌గేట్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారును ఓవర్ టేక్ చెయ్యబోయి డివైడర్ ను ఢీకొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాలలోకి వెళితే స్నేహితుడి సోదరి వివాహానికని  ఎనమిది మంది యువకులు మారుతీ ఎర్టికా కారులో  హైదరాబాదు నుండి అనంతపూర్ కు బయల్దేరారు. షాద్ నగర్ సమీపంలో ఉన్న టోల్‌గేట్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న మరో కారును ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న డివైడర్ ని ఢీకొట్టారు. దీంతో కారు 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా మర్రో ఐదుగురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. యువకుల అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Read latest  Crime News and Telugu News Follow us on FaceBookTwitter

Image result for డివైడర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Tags: 3 members died car accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top