logo

విశాల్ పెళ్లి క్యాన్సిల్ కాలేదట ..


12-Oct-2019 20:43IST
vishal wedding is not cancel

హీరో విశాల్ పెళ్లి హైదరాబాద్ కి చెందిన అనిషా రెడ్డి తో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత విశాల్ రకరకాల గొడవల్లో ఇరుక్కోవడం ఇబ్బంది పెట్టింది. నడిగర సంఘం భవంతి నిర్మించాకే పెళ్లాడతానని సవాల్ చేసిన విశాల్ అందుకోసం వెయిట్ చేశాడు. ఆ క్రమంలోనే అనీషాతో విశాల్ పెళ్లి రద్దయ్యిందంటూ ప్రచారమైంది. ఈ ప్రచారాలకు నిజం చేకూరుస్తూ అనిషా తన నిశ్చితార్దానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా లో తొలగించడంతో ఇదంతా నిజమే అనుకున్నారు. 
Image result for విశాల్ పెళ్లి క్యాన్సిల్ కాలేదట ..


అయితే తాజాగా ఈ వార్తలపై విశాల్ తండ్రి జీకే రెడ్డి స్పందించారు. తాజాగా 'దమయంతి' సినీప్రమోషన్స్ లో విశాల్ తండ్రి జీ.కే.రెడ్డి ఈ పెళ్లి పుకార్లకు చెక్ పెట్టారు. అనీషాతో విశాల్ పెళ్లి రద్దయ్యిందన్న దాంట్లో ఎలాంటి నిజం లేదని, సోషల్ మీడియాలో వచ్చే  కట్టు కథనాలు నమ్మొద్దని, పెళ్లి తేదీని నిర్ణయించాక వెల్లడిస్తామని అన్నారు. విశాల్ అనుకున్నట్టుగానే నడిఘర్ సంఘం భవనం పూర్తైన వెంటనే విశాల్ పెళ్లి ఉంటుందని తేల్చేసారు.ఇక ప్రస్తుతం విశాల్ అటు సినిమాల్తోనూ , ఇటు నడిఘర్ భవన నిర్మాణ పనులలోను బిజీ గా ఉన్నారు. 

Tags: vishal wedding anisha reddy not cancel

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top