logo

పిడుగుపాటుకు ఎద్దు మృతి


12-Oct-2019 21:09IST
bull killed by thunderbolt

పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి మండలంలో గుండారం గ్రామానికి చెందిన ఎల్కంటి సంజీవ రెడ్డి అనే వ్యక్తి ఎడ్లతో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా గత రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగుపాటుతో ఆ వ్యక్తికి చెందిన ఎద్దు ఒకటి మృతి చెందింది. 
Image result for పిడుగుపాటుకు ఎద్దు మృతి


దీంతో మర్నాడు పొలానికి వచ్చిన సంజీవ రెడ్డి ఆ ఎద్దు చనిపోవడం చూసి తీవ్ర అవేదన చెందాడు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి...తనకు ఆర్ధిక సహాయం చేయాలని కోరాడు. కాగా విషయం తెలుసుకున్న ఎంపీపీ లింగాల నిర్మల సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరుపున సహాయం అందేలా చేస్తామని అన్నారు.

Tags: bull killed thunderbolt siddipet

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top