logo

హుస్నాబాద్ మండలంలో భారీ వర్షాలు


12-Oct-2019 21:13IST
heavy rains in husnabad zone

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా  భారీ వర్షాలు కురుస్తున్నాయి. హుస్నాబాద్ మండలంలో...భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. పందిల్ల , పోతారం(ఎస్) మీర్జాపూర్, గాంధీనగర్ గ్రామాల్లో చెరువులు జల కళ సంతరించుకున్నాయి. ఇక భారీ వర్షాలకు పంటలు నీట మునగడంతో పాటు ఇళ్ళు కూలిపోయాయి. భారీ వర్షానికి పోతారం( ఎస్ ) గ్రామానికి చెందిన సత్తవ్వ అనే వృద్ధురాలు ఇల్లు నేల మట్టం అయింది. ఆ వృద్ధురాలు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయట పడింది. కాగా ఆ వృద్ధురాలకి తగిన సహాయం అందేలా చూస్తామని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. వివిధ గ్రామాల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటలు నీట మునగడంతో... పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నష్ట పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Related image

Tags: heavy rains husnabad zone crops

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top