logo

టీఎస్ఆరిసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల


13-Oct-2019 17:58IST
releasing notifications for job replacement in tsrtc

గత కొద్దీ రోజులనుండి ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న నేపథ్యంలో సమ్మెకు దిగిన కార్మికులను ఏకపక్షంగా తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్న విషయం మనకు తెలిసిందే. అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ విభాగాల్లో కాలిగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో తాత్కాలిక ప్రాతిపదికన దినసరి వేతనంతో వీరిని విధుల్లోకి తీసుకోనున్నారు. 

డ్రైవర్లకు రోజుకు రూ.1500, కండక్టర్లకు రూ.1000 అందించనున్నారు. అలాగే మెకానిక్, ఎలక్ట్రిషియన్, టైర్ మెకానిక్‌, క్లరికల్ సిబ్బందికి రూ.1000 అందించనున్నారు. ఇక ఐటీ ట్రైనర్ నిపుణులకు రోజుకు రూ.1500 చెల్లించనున్నారు. కావునా సంబంధిత విభాగాల్లో ఆసక్తి, అనుభవం, అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను తినుకొని తమ సమీపంలోని  డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది.   


Image result for tsrtc pressnote

Tags: releasing notifications job replacement tsrtc

Advertisement
Advertisement
Top