logo

దేవరకొండలో పెద్ద పులి సంచారం


16-Oct-2019 17:21IST
tiger wandering in devarakonda police station area

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతంలో పక్క దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా ఓ పెద్ద పులి వారిఫై దాడి చేసి దారుణంగా చంపేసి వారి మృతదేహాలను అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో మృతదేహాలను గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు  వెంటనే ఘటన స్ధలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమ్మిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భాదిత్ల కుటుంబాలకు సమాచారం అందజేశారు. గతంలో కూడా పెద్ద పులి దేవరకొండ పట్టణంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయనే విషయం గురించి వార్తలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


Image result for large tiger

Tags: tiger wandering 2killed devarakonda police station

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top