logo

డీజిల్ అయిపోవటంతో బస్సును వదిలివెళ్ళిన ప్రైవేట్ సిబ్బంది.


16-Oct-2019 20:28IST
private driver stops bus in telangana

గత 11 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రయాణికులకు కష్టాలు తప్పటం లేదు. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగుడెంలో గత రాత్రి ప్రైవేట్ సిబ్బంది నిర్వాకంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. 

Image result for private driver, telangana, tsrtc

బస్సు లో డీజిల్ అయిపోయిందన్న నెపంతో బస్సులో ప్రయాణికులను నడి రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, చిన్న పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సిబ్బంది టికెట్ ఇవ్వకుండా అధిక చార్జీలు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags: private driver telangana tsrtc

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top