logo

ఆంధ్రజ్యోతి విలేకరి హత్యపై స్పందించిన పవన్ కళ్యాణ్.


16-Oct-2019 20:31IST
pawan kalyan respond on andhrajyothi murder

తూర్పు గొదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆంధ్రజ్యోతి విలేకరి హత్య సంఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందింస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేస్తున్న కాతా సత్యనారాయణను హత్య చేయటం క్రూరమైన చర్య అని, ఇదొక ఆటవిక చర్యగా జనసేన భావిస్తోందని పేర్కొన్నారు. ఈ సంఘటనతో ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా వుందని భయపెడితేనే తప్ప కలాలకు సంకెళ్లు వేయలేమనే నిర్ణయానికి వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని ప్రెస్ నోట్ లో వెల్లడించారు.

Image result for pawan kalyan, andhrajyothi murder
సత్యనారాయణ ఇంటికి  కూతవేటు దూరంలోనే నడిరోడ్డుపై ఈ హత్యకు పాల్పడ్డారంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, పాత్రికేయుడిపై నెల కిందట ఒకసారి హత్యాయత్నం జరిగిన అతనికి పోలీసులు రక్షణ కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుడు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వం పక్షపాతం చూపకుండా దీని వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: pawan kalyan andhrajyothi murder

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top