logo

నేటితో మద్యం దుకాణ దరఖాస్తులకు ముగియనున్న గడువు


16-Oct-2019 20:36IST
deadline for liquor store applications today

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానం తో మద్యం దుకాణాల టెండర్లకు వ్యాపారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 6నుంచి 16 వతేది వరకు  దరఖాస్తు చేసుకుందుకు ప్రభుత్వం గడువు విధించింది.దరఖాస్తులకు గడువు సమీపిస్తుండడంతో ప్రభుత్వ మద్యం షాపులను సొంతం చేసుకోవటం కోసం వ్యాపారస్తులు పెద్దఎత్తున ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు.ఇప్పటి వరకు 20 వేల 630 దరఖాస్తులు ఎక్సైజ్ శాఖకు చేరగా మంగళవారం ఒక్కరోజే 10 వేల దర ఖాస్తులు చేరాయి.రాష్ట్ర ప్రభుత్వం 2017 కంటే దరఖాస్తు ఫీజులను భారీగా పెంచింది.తాజాగా పెంచిన దరఖాస్తు ఫీజులతో ప్రభుత్వానికి 420 కోట్ల ఆదాయం చేకూరనుంది.బుధవారం సాయంత్రం 4గంటలకు గడువు ముగుస్తుండడంతో మరింత భారీగా దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంది. 

Image result for liquor stores, telangana

Tags: liquor stores telangana

Advertisement
Advertisement
Top