logo

బానపొట్ట ఉందా ఇవి పాటించండి..


17-Oct-2019 09:39IST
how to lose belly fat

ప్రస్తుత రోజుల్లో ఎక్కువశాతం ఉద్యోగాలన్నీ కూర్చొని చేసేవే అందుకే ఎక్కువ మందికి బానపొట్ట సమస్య వేధిస్తుంది. పైగా ఈరోజుల్లో ఎక్కువమంది జనాలు జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడుతున్నారు. పిజ్జా, బర్గర్ తో పాటు రకరకాల బిర్యానీలు నెటిజనులను బాగా ఆకర్షిస్తున్నాయి. జంక్ ఫుడ్స్ లేదా కొవ్వు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక కొవ్వుతో పాటుగా అధిక పొట్టతో కూడా చాలా మంది భాధపడుతుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే కూర్చొని ఎలా తగ్గించుకోవచునో ఇప్పుడు ఓ లుక్ వేద్దాము.. 


రోజూ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి ఏవైనా చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీ ఒంట్లో ఉన్న కొవ్వు అంత కొద్ది కొద్దిగా కరుగుతూ వస్తుంది. అంతేకాకుండా కనీసం 10 నిమిషాలైన వ్యాయామం చేయాలి.
మన తినే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆహరం త్వరగా జీర్ణమై పొట్టంతా ఫ్రీ గా ఉంటుంది. ఆకలి కూడా బాగా వేస్తుంది.
పీచు పదార్ధాలు ఎక్కువగా వీటిలో ఉంటాయి. పచ్చి కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరలు తీసుకుంటుండాలి.
మీరు బేకరి ఫుడ్స్, వేపుళ్లు, మాంసాహారం, ఐస్‌క్రీములు, బిర్యాని వంటి వాటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.
రోజు మొత్తంలో కనీసం 4 లీటర్ల మంచినీళ్లు తాగాలి. మీ శరీరంలో నీరు శాతం తగ్గిపోతుందనడానికి ఉదాహరణలు పెదవులు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, కళ్ళుమంటలు మొదలగు సమస్యలు తలెత్తుతాయి. అందుకే నీటిని ఎక్కువగా తీసుకొంటే ఎటువంటి సమస్య ఉండదు.. 

చూసారుగా ఈ టిప్స్ మీకు నచినట్లైతే మీరు కూడా ట్రే చేయండి.. Tags: bellyfat easy reduce proccess homemade tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top