logo

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విద్యార్థి సంఘాల మద్దతు


17-Oct-2019 18:27IST
students support tsrtc strike

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసి కార్మికులు గురువారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం జీతాలు చెల్లించాలంటూ, వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ పలకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. కాగా కార్మికుల సమ్మెకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కదిలాయి..యస్.ఫ్.ఐ/యం.యస్.ఫ్/యన్.యస్.యు.ఐ..తదితర విద్యార్థి సంఘాలు ఆర్టీసి జేఏసీతో కలిసి దీక్షా స్థలి నుండి జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తు ర్యాలీలో పాల్గొని సంఘీ భావం తెలిపారు. అనంతరం సుందరయ్య భవనం వద్దకు చేరుకొని కార్మికుల సమస్యలను విద్యార్థి నాయకులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 

Image result for tsrtc strike 2019, telangana

Tags: tsrtc strike 2019 telangana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top