logo

భారీ స్కోర్ ని సాధించిన భారత్


20-Oct-2019 15:27IST
India have a huge score

ఝార్ఖండ్‌లోని రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులోని తొలి ఇన్నింగ్స్ లో భారత్ 9వికెట్ల నష్టానికి 419పరుగులు తీయగా నేటి ఆటకు టీమిండియా డిక్లేర్ ని ప్రకటించింది. ఈ ఆటలో ఇప్పటి వరకు ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 212 పరుగులతో విజృంభించగా..అజంక్యా రహానే 115 పరుగులతో రాణించాడు. అలాగే జడేజా 51పరుగులను సాధించడంతో భారత్ భారీ స్కోరుని సొంతం చేసుకుంది. ఇక చివరిగా బరిలోకి దిగిన భారత బౌలర్ ఉమేష్ యాదవ్ 5సిక్సర్ లను బాది భారత క్రికెట్ ప్రియుల గుండెల్లో భారీ ఉత్సాహాన్ని నింపాడు. అలాగే సౌతాఫ్రికా బౌలర్లలో లిండేకు 4వికెట్లు, రాబడాకు 3వికెట్లు పడగా...అన్ రిచ్ కి ఒకటి, డేన్ కు ఒక వికెట్ పడింది.   

Read latest Sports News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: India south africa huge score raanchi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top