logo

రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ సక్సెస్


22-Oct-2019 15:51IST
royal visista boat operation success

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులోమునిగిపోయిన రాయల్ వశిష్ట బోటుని వెలికితీసే ప్రయత్నం నేడు సక్సెస్ అయ్యింది. రెండు రోజులుగా నది అడుగు భాగానికి వెళ్ళిన సీ డ్రైవర్స్ బోటును బయటకు తీశారు. చాలా రోజుల నుండి నీటిలో మునిగిపోయి ఉండటం వల్ల బోటు పూర్తిగా ధ్వంసమైనట్లు బోటుని బయటకు తీసుకువస్తున్న ధర్మాడి సత్యం బృందం పేర్కొంది. గత నెల 15వ తేదీన 77మందితో పాపికొండల విహారయాత్రకు వెళ్తున్న రాయల్ విశిష్ట బోటు ప్రమాదానికి గురై తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగింది.
 
Image result for kachulooru rayal visista boat


ఈ ప్రమాదంలో 39 మంది మృతిచెందగా 12 మంది గల్లంతయ్యారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన ఆ మృతదేహాలు బోటులోనే చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్న క్రమంలో కొన్ని రోజులుగా బోటు వెలికితీత పనుల్ని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీం చేపట్టింది. ఈ క్రమంలో నిన్నట్నుంచి విశాఖ నుంచి సీ డ్రైవర్స్‌ను తీసుకొచ్చి బోటును బయటకు తీసేందుకు పనులను వేగవంతం చేసింది. దాంతో నీటి అడుగు భాగం నుంచి రోప్‌ల సాయంతో బోటుని బయటకు తీశారు.


Read latest Andhra Pradesh News and Telugu News Follow us on FaceBookTwitter


Tags: royal visista boat operation success

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top