logo

రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం ... 


22-May-2019 09:43IST
11 members died in road accident

గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాను, ఆయిల్‌ ట్యాంకర్‌‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గంభీరా గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.  

Tags: road accident Gujarat 11 members died

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top