logo

రవి ప్రకాష్ కోసం గాలిస్తున్న మూడు బృందాలు .. 


22-May-2019 09:59IST
polices searching ravi prakash

తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం తెలంగాణ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, గాలింపును తీవ్రతరం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసులతోపాటు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కూడా రవిప్రకాశ్ కోసం గాలిస్తున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ ఆంధ్ర ప్రదేశ్ లో ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిని విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ, పోలీసులు పలుమార్లు నోటీసులు పంపిన సంగతి అందరికి తెలిసిందే. ఆయితే వీరు మాత్రం కోర్టును ఆశ్రయిస్తూ, ముందస్తు బెయిల్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా  నకిలీ పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలపై ఐటీ యాక్ట్, 66, 72, ఐపీసీ సెక్షన్ 406, 420, 467, 469, 471 కింద సైబరాబాద్‌ పోలీసులు కేసులను నమోదు చేసారు. 

Tags: tv9 ceo ravi prakash telugu news channel

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top