logo

ప్లాస్టిక్‌ను నిషేధించాలి: కలెక్టర్‌ నారాయణ రెడ్డి


26-Oct-2019 14:43IST
plastic should be banned collector narayana reddy

దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేదించాలనే ఆలోచనతో ప్రధాని మోడీ శ్రీకారం చుట్టిన ప్లాస్టిక్‌ నిషేద కార్యక్రమం పలు ప్రాంతాలలోని అధికారులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలోని కలెక్టర్‌ నారాయణ రెడ్డి నేడు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలను సందర్శించి, తనిఖీ చేశారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని ఎలాగైనా నిషేధించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పలు దుఖాణాల వ్యాపారస్తులకు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ...ప్లాస్టిక్ వాడకం వలన మనం అనేక సమస్యలను ఎదుర్కుంటునామని, ప్రతి ఒక్కరు ఈ ప్లాస్టిక్ ని వినియోగిస్తుండడంతో భూమి పైన విపరీతమైన చెత్త పేరుకుపోతుందన్నాడు. అలాగే ఈ ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు రోడ్లపైన ఎక్కువగా ఉండడంతో వాటిని పశువులు తింటున్నాయి. దాంతో అది జీర్ణం కాక, అవి మరణిస్తున్నాయని కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా మురికి కాల్వలల్లో ఇవి పేరుకుపోవడం మూలంగా వర్షాలు కురిసినప్పుడు వరద నీటికి అడ్డు పడి మురికి నీరు రోడ్లపైకి చేరి మనకే ఇబ్బందిగా మారుతున్నాయని తెలిపారు. అనంతరం ఇకనుంచి ఎవరైనా ఒకసారి వాడే ప్లాస్టిక్‌ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags: plastic banned siddipet mulugu collector narayana reddy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top