logo

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు


26-Oct-2019 16:55IST
intermediate exam fee payment date extended

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను పెంచుతున్నట్టుగా నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఒక అధికార ప్రకటనను విడుదల చేశారు. కొన్నికారణాల దృశ్య విద్యార్థులు పరీక్ష ఫీజుని చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఫీజు చెల్లించే గడువును అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. 

Related image
దాంతో విద్యార్థులు  అక్టోబర్ 29  నుంచి నవంబర్ 4 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు.. గతంలో ఫెయిలైన విద్యార్థులు, ప్రైవేట్ విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఒక వేళ ఇచ్చిన గడువులోపు ఫీజు చెల్లించని యెడల ఆలస్య రుసుముతో డిసెంబరు 16 వరకూ పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. 

Tags: ts intermediate exam fee payment date extended

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top