logo

ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి డ్రైవర్ మృతి..


31-Oct-2019 10:50IST
man died in kadapa on road accident

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటుచేసుకుంది. మండ‌ల ప‌రిధిలోని చౌడూరు గ్రామం నుంచి ఇసుక‌ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ పుష్పరాజ్ ఇసుక నింపుకొని పెద్ద‌శెట్టి ప‌ల్లె గ్రామానికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పిపక్కనే ఉన్న పశువుల పాకలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపాలైన ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ అక్క‌డిక‌క్కడే మృతి చెందాడు.ప్రమాద సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

 Read latest Andhra Pradesh News and Telugu News |Follow us    on FacebookTwitter 

Image result for man died, kadapa, road accident

Tags: man died kadapa road accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top