logo

కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం


03-Nov-2019 18:11IST
kcr toy burned in siddipet

సీఎం కేసీఆర్ బీజేపీ ఎంపీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.సీఎం కేసీఆర్ బీజేపీ ఎంపీలకు బేషరతుగా క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేస్తూ ప్రధాన కూడలిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యమం పేరు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఏవరో ప్రజలకు తెలుసని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ప్రాణాలు పోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రోజు కేసీఆర్ గద్దెనెక్కి ఆర్టీసీ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మొండి వైఖరి వలన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడి,వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెంటనే బిజెపి ఎంపీలకు క్షమాపణ చేప్పాలని లేని యేడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 

Image result for కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం..

Tags: kcr bjp siddipet

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top