logo

దేవరకొండలో దాశరథి కృష్ణమాచార్యులు సంస్మరణ సభ


05-Nov-2019 18:45IST
dasarathi krishnamacharyas commemorative meeting at devarakonda

నల్గొండ జిల్లాలోని దేవరకొండ ఎం.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాకవి, కళాప్రపూర్ణ దాశరథి కృష్ణమాచార్యులు గారి వర్థంతి సందర్భంగా సంస్మరణ సభను తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్ ఖానమ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ... తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటంలో విప్లవ కవిగా, ధ్వజమెత్తిన ప్రజల పక్షాన నిలిచిన కవిగా, మార్పు కోసం తీర్పునిచ్చిన కవి దాశరథిని స్మరించారు. ఉత్తమ అనువాద రచయితగా, కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు గ్రహించిన కవిగా, రాష్ట్ర ఆస్థానకవిగా, సినీ గీత రచయితగా దాశరథి సేవలు ఎనలేనివని కీర్తించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి జల్దా విశ్వనాథ్ కుమార్ ఆయన కవితా పంక్తులను, ఉత్తమ సినీ గీతాలను పాడి వినిపించగా, శిగ శ్రీనివాస్ గారు ఆ చల్లని సముద్రగర్భం గీతాన్ని ఆలపించారు. వైస్ ప్రిన్సిపాల్ ఏడుకొండలు గారు, కవి కోటయ్య గారు, రాజు గారు, లక్ష్మీ ప్రభావతి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: dasarathi krishnamacharya commemorative meeting devarakonda

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top