logo

ఇంటర్ బాధిత కుటుంబాల మౌన దీక్ష


24-May-2019 16:57IST
silence of interfamilies affected

హైదరాబాద్: ఇంటర్ బోర్డు తప్పిదాలపై సీఎస్‌ను కలిసేందుకు అఖిలపక్ష నేతలు సచివాలయానికి వెళ్లారు. అఖిలపక్ష నేతలతో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆ బృందంలో ఉన్నారు. అయితే వీరిని కలవకుండానే సీఎస్ వెళ్లిపోయారు. దీనిపై అఖిలపక్ష నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జూన్ 2 న సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఇంటర్ బాధిత కుటుంబాలు మౌన దీక్షను నిర్వహించునున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇంటర్ బాధిత కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. 

Tags: inter-families affected

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top