logo

జవాను ఆత్మహత్య


25-May-2019 09:53IST
jawan suicide

హైదరాబాద్: ఎన్నికల విధుల కోసం వెళ్లిన ఓ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన త్రిపురలోని ధలై జిల్లాలో చోటు చేసుకుంది. బస్సులో ఒంటరిగా ఉన్న సమయంలో తన తుపాకీతో తానే కాల్చుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు.. జవాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఆశ్విని కుమార్ జమ్మూకశ్మీర్‌కు చెందిన వ్యక్తి. బీఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అత‌ని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags: jawan suicide

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top