logo

భార్య మృతితో ఆగిన భ‌ర్త‌ గుండె


25-May-2019 12:20IST
the wifes who struck with his wifes death

రంగారెడ్డి: బ‌్ర‌తికున్నంత‌కాలం ఒక‌రికొక‌రుగా జీవించారు. చివ‌ర‌కు చావులోనూ ఒక‌రి తోడును ఒక‌రు వీడ‌లేదు. భార్య మృతిని తట్టుకోలేక భర్త గుండె ఆగిపోయింది. ఈ విషాద సంఘటన కందుకూరు మండలంలో చోటుచేసుకున్నది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, చిప్పలపల్లి గ్రామానికి చెందిన కావలి పెంటయ్య(55) భార్య బాలకిష్టమ్మ(50). అయితే నాలుగు రోజుల కిందట భార్య బాలకిష్టమ్మ ఉపాధి కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యింది. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని భర్తకు తెలియజేయకుండా కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి తీసుకువచ్చారు. ఆ దృశ్యం చూసిన భర్త పెంటయ్య గుండె పగిలింది. తీవ్రంగా కలత చెంది అక్కడికక్కడే కుప్పుకూలాడు. కుటుంబసభ్యులు పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. భార్యాభర్తలు గంటల వ్యవధిలో మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags: wife and husbend

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top