logo

పురుగుమందు తాగి చిన్నారులు మృతి..


14-Nov-2019 18:32IST
2 childrens died because pesticides

కూల్ డ్రింక్ అనుకొని పురుగుమందు తాగిన ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నర్సయపల్లి గ్రామం పిట్టలగూడలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పాఠశాల నుండి వచ్చిన భాస్కర్, రవీందర్ ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందును కూల్ డ్రింక్ అనుకొని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారి పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు చర్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేస్తుండగా భాస్కర్ చనిపోయాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రవీందర్ చనిపోయాడు. భాస్కర్, రవీందర్ ఇద్దరూ వరుసకు బావాబామ్మర్ధులవుతారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Image result for pesticides bottles

Tags: 2 childrens died pesticides

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top