logo

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన వీఆర్‌వో


26-May-2019 00:20IST
vro caught red handed by the acb officials

జ‌హీరాబాద్ః మ్యూటేష‌న్ చేయాల‌ని కోరిన ఓ రైతు కుటుంబం నుంచి రూ.15వేలు డిమాండ్ చేసి ఏసీబీ వ‌ల‌లో చిక్కిన సంఘ‌ట‌న జ‌హీరాబాద్‌లో చోటు చేసుకున్న‌ది. జ‌హీరాబాద్ మొగుడంప‌ల్లికి చెందిన వెంక‌ట‌రెడ్డి, నారాయ‌ణ‌రెడ్డి, న‌ర్సిరెడ్డి, రంగారెడ్డిలు అన్న‌ద‌మ్ములు కాగా వారి ఆస్తికి సంబంధించిన మ్యుటేష‌న్ చేయాల‌ని వీఆర్‌వో అయూబ్ అబ్దు్ల్లాను రైతు బందువు అశో్క్‌రెడ్డి కోరాడు. ఇందుకు గాను రూ.15వేలు వీఆర్‌వో డిమాండ్ చేయ‌డంతో ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో ఏసీబీ అధికారుల‌ను సంప్ర‌దించగా, ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కారం వ‌లప‌న్ని ప‌ట్టుకున్నారు. నిత్యం బలంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మొగుడంప‌ల్లి మండల తహశీల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ లంచావతారం ఈరోజుతో ఆటకట్టయింది. ఈ లంచావతారం పట్టుబడగా... మరెందరో ఇలాంటి వారే ఈ తహశీల్ కార్యాలయంలో ఉన్నారనే వ్యాఖ్యానం స్థానికంగా వినవస్తున్నది. 

Tags: vro acb

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top