logo

కన్నతల్లే కర్కశంగా క‌డ‌తేర్చింది


26-May-2019 11:05IST
mother has been thrown hard

సిద్దిపేట: కన్నతల్లే తన ఇద్దరు పిల్లల్ని అతి కర్కశంగా కడతేర్చింది. సిద్దిపేటలోని గణేశ్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒళ్లుగగుర్పాటుకు గురిచేసే ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక వివరాల ప్రకారం.. సిద్దిపేటలోని గణేశ్నగర్‌లో నివాసం ఉంటున్న సరోజ అనే మహిళ తన ఇద్దరు పిల్లలు ఆర్యన్ (5), హర్షవర్ధన్ (రెండున్నరేళ్లు)లను నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో అతి కిరాతంగా దాడిచేసి చంపింది. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య అనంతరం తల్లి సరోజ కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడం గమనార్హం. అడిషనల్‌ డీసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పిల్లల మృతదేహాలకు పంచనామా కార్యక్రమాలు పూర్తిచేశారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Tags: mother son dady suside death

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top