logo

వివో యూ20 స్మార్ట్ ఫోన్ రిలీజ్


22-Nov-2019 23:54IST
vivo U20 smart phone release

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య పెరిగిపోతున్న పోటీల కారణంగా  షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో, సాంసంగ్ లాంటి స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కొత్త కొత్త సెగ్మెంట్లలో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటన్నింటికి దీటుగా నేడు వివో యూ-సిరీస్‌లో మరో కొత్త మోడల్ ని ఇండియన్  మార్కెట్లో విడుదల చేసింది. వివో యూ20 అనే పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ఏఐ ఇంజిన్ చిప్‌సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.10,990 కాగా, 6 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.11,990. సేల్ నవంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియాతో పాటు వివో వెబ్‌సైట్‌లో ప్రారంభం అవుతుంది. ప్రీపెయిడ్ పేమెంట్‌ చేసేవారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. 

వివో యూ20 ఫీచర్స్ ఇవే:

ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఫన్ టచ్ ఓఎస్ 9
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ వేరియంట్లో లభించనున్నాయి. 
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675
రియర్ కెమెరా: 16+8+2 మెగాపిక్సెల్

ధర:
4 జీబీ + 64 జీబీ- రూ.10,990
6 జీబీ + 64 జీబీ- రూ.11,990

Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్‌లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే

Tags: vivo U20 smart phone release

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top