logo

ముగిసిన తొలిరోజు ఆట..టీమిండియాదే పై చేయి


23-Nov-2019 00:55IST
the first day of the game is over team india is lead

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌,భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి డే/ నైట్ మ్యాచ్‌ ముగిసింది. మొదట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కు టీంఇండియా బౌలర్లు హడలెత్తించడంతో బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది. పింక్ బాల్ తో తొలిసారి బౌలింగ్ చేస్తున్నా అద్భుతంగా బంతులు విసిరి బంగ్లా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. ఇషాంత్ శర్మ 22 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లతో రాణించారు. బాంగ్లాదేశ్ ఆట ముగిసిన తరువాత బరిలోకి దిగిన టీమిండియా ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 59, అజింక్యా రహానే 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. పుజారా 55 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (14), రోహిత్ శర్మ (21) పెద్దగా ప్రభావం చూపకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 68 పరుగులు. టీమిండియా రేపు వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరు నిలిపే అవకాశం ఉంది.

Ind vs Ban: Ishant, Pujara And Put India In Command - Sakshi

Tags: india V/S bangladesh first day game is ove team india is lead

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top