logo

విచిత్రమైన పెళ్లిళ్లు ఏంటో చూడండి..


23-Nov-2019 02:24IST
worls femous marriege

పెళ్లి అంటే రెండు మనసులు ఏకమై ..మూడు ముళ్ల బంధంతో , ఏడూ అడుగుల సాయంతో , వేదం మంత్రాల సాక్షిగా , బంధు జన సమక్షంలో ఆ ఇరువురు ఒకటైతే దానిని పెళ్లి అంటారు. కానీ కొన్ని దేశాలలో పెళ్లిళ్లు వింతగా జరుగుతాయి. అది కూడా కొన్ని రకాలా టెస్టులను పెట్టి వాటిలో ఆ దంపతులు పాస్ అయితేనే వాళ్లకు పెళ్లి చేస్తారంట..అలా వింత ఆచారాలను కలిగిన పెళ్లిళ్లు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఎలాంటి ఆచారాలతో పెళ్లిళ్లు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రాన్స్ :

ఆ ఫ్రాన్స్లో పెళ్లి చేసుకున్న నవ దంపతులు యుక్త వయస్కులు అయితే..వారి శోభనం రాత్రి ఫ్రెండ్స్ వారి గది బయట మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు వేస్తుంటారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా..ఉందండి..బయట ఉన్న వాళ్లకు మద్యం అందించాలంట ఆ నవ దంపతులు .వాళ్ళు ఇచ్చిన విందుతో సంతృప్తి ఛేదింతేనే వారి శోభనం..ఒక్క సారి వారి సంతృప్తి పొందకుంటే డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది.ఆలా జరగకుండా ఉండాలంటే అబ్బాయి ఎలాగోలాగ వారిని బుజ్జగించి పంపించాలి. లేకుంటే  అబ్బాయిని బట్టలు లేకుండా ఎక్కడో దూరంగా వదిలేసి వస్తారంట..ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడుందో కనుకొని వచ్చి శోభనం చేసువాలంట..

స్కాట్ల్యాండ్ :

ఇక ఈ స్కాట్ల్యాండ్లో కూడా వింత ఆచారముందండి. ఎవరైనా పెళ్లి అంటే దంపతులపై పువ్వులు లేదా మనదేశంలో అయితే అక్షింతలు వేస్తారు. ఈ ప్రాంతంలోని కొన్ని ఏరియాలలో మాత్రమే ఈ వింత ఆచారం ఉందంట..ఆ దంపతులను ఒక చెట్టుకు కట్టేసి కుళ్ళిన గుడ్లు , చనిపోయిన చేపలు..కోడి బొచ్చు ఇలా కుళ్ళిన కూరగాయలు వంటి వాటిని ఫ్రెండ్స్ మరియు బంధువులు వారి మీద వేస్తారంట.అంతేకాకుండా వాళ్ళను అక్కడ ఒక చెట్టుకు కట్టేసి రెండు గంటలు ఉంచుతారంట. ఆ వాసనను తట్టుకోవాలి ,మరియు అక్కడ ఎవరు వారిని చుసిన సిగ్గుపడకుండా ఉంటె వాళ్ళు అన్నిరకాలుగా పెళ్ళికి సిద్ధమని వారి నమ్మకం అంట..అలా అన్నిటిని తట్టుకుంటేనే పెళ్లి లేకుంటే లేదట..

చైనా :

చైనాలో తుజీగా అనే ఒక తెగ ప్రాంతీయ వాసులు ఒక వింత ఆచారాన్ని కలిగి ఉన్నారు. అదేంటంటే పెళ్లి సమయంలో వధువు రోజంతా ఏడుస్తూనే ఉండాలంటే. దానికోసం ఆమె ఒక నెల ముందు నుండి ఏడ్వడం నేర్చుకుంటుందంట.ఆమె అలా ఏడుస్తున్నపుడు వాళ్ళ అమ్మ కూడా ఆమెకు తోడుగా ఏడుస్తుంది. ఒకవేళ పెళ్లి రోజు అమ్మాయి ఏడ్వకపోతే మాత్రం పెళ్ళికి వచ్చిన బంధువులు పెంపకం సరిగా లేదని నిందలు వేస్తారంట.ఇకపోతే పెళ్లి అయ్యాక అమ్మాయి వాళ్ళ ఇంట్లో అమ్మ , తర్వాత అమ్మమ్మ ఏడుస్తారు.ఆ ఏడ్పు భాదతో కాదంట..పెళ్లి జరిగిందని ఆనందం వచ్చే కన్నీరని వారి నమ్మకం. ఇలా ఆమె గర్భవతి అయ్యే వరకు 
రోజు ఏడుస్తారట..

ఓర్నియో:

ఈ ఓర్నియోకు చెందిన రైడన్ అనే తెగ వాళ్లకు ఒక చెప్పలేని ఆచారముంది. అదేంటంటే పెళ్ళైన నవదంపతులు మూడు రాత్రులు గడిచేంతవరకు బాత్ రూమ్ కు వెళ్లకూడదట..కనీసం ఒకటికి కూడా వెళ్లకూడదట.వాళ్లకు రూమ్ బయటే అన్నము తినిపిస్తారట. ఇంకా తరువాత వాళ్ళు బాత్ రూమ్ కు వెళ్లనివ్వకుండా బయట కాపలా ఉంటారంట.ఒకవేళ తెలియకుండా వాళ్ళు ఒకటికి అలా వెళితే వారి జీవితంలో ఎన్ని కష్టాలొస్తాయని వారు భావిస్తారు..మనకు ఒకటికి వెళ్ళడానికి ఒక్క నిమిషం లెట్ అయితే అలాగే పోసుకుంటాము మరి వాళ్ళు మూడు రోజులు ఎలా ఉంటారో వారికే తెలియాలి.

ఇండియా :

మన ఇండియా లో మూఢ నమ్మకాలకు పుట్టినిల్లు అని అందరికి తెలుసు. సాంప్రదాయాలు పుట్టింది ఇండియాలోనే అంతే రేంజులో మూఢనమ్మకాలు పుట్టుంది ఇండియాలోనే.దేవుడులను ఎక్కువగా నమ్మే ఇండియన్స్ మూఢ ఆచారాలను కూడా నమ్ముతారు. ఇండియాలో పెళ్లి తంతులో వింత ఆచారం ఏంటంటే..పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కుజ దోషం కనుక ఉంటె,ఆమె భర్త తొందరగా చనిపోతాడని నమ్ముతారు.దానికోసం ఆమె దోషం పోవాలంటే ముందుగా అరటి చెట్టుతో ఆమె వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత ఆ చెట్టును నరికేసి , ఆమె తాళిని తీసేసి మల్లి పేలి చేస్తారు.ఇలా చేయడం వల్ల ఆమె దోషం పోతుందని నమ్మకం. మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ కూడా ఇలానే చేసి అభిషేకును పెళ్లి చేకుందట..

చూసారుగా ఫ్రెండ్స్ పెళ్లితో ఈ ప్రాంతాల్లో ఒకటవ్వాలంటే ముందుగా ఈ ఆచారాలను పాటించాలి..అప్పుడే వాళ్ళు ఓ ఇంటి వాళ్ళు అవుతారు..ఇలాంటి వింతలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి..

Image result for different marriages

Tags: worls femous marriege s

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top