logo

అలా పూర్ణాలు చేసుకుంటే బాగుంటాయి..


23-Nov-2019 03:24IST
vairaty purnalu easy preparation

పూర్ణాలు మాములుగా స్వీట్స్.. అయితే ఇలాంటి పురాణాలను వెరైటీగా చేసుకోవచునట..ఆలస్యమెందుకు  ఓ పారి చూసెయ్యండి..

కావాల్సిన పదార్థాలు : 
పూర్ణం కోసం: పచ్చిశెనగపప్పు- 1కప్పు, 
బెల్లం తురుము- 1కప్పు,
 యాలకుల పొడి- చిటికెడు
కుడుముల కోసం : బియ్యం పిండి- 1 కప్పు, 
బెల్లం- 1/2 కప్పు

తయారీ : 

ముందుగా పచ్చిశెనగపప్పును ఉడికించి నీటిని వంపేయాలి. బెల్లంను పొడి చేసుకుని... ఉడికించిన శెనపప్పు, బెల్లం, యాలకుల పొడి కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండిలో బెల్లం పొడి వేసి కొద్దిగా నీటిని కలిపి ముద్దలా చెయ్యాలి. దీనిని చిన్న చిన్న లడ్డూలులాగే చేసి ఒక్కోదాన్ని పూరీల్లా వత్తాలి. ఇలా చేసిన పూరిల్లో పూర్ణం లడ్డూని పెట్టి మడత వేసి అంచులను (కోవాపూరిలా) చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న అన్నింటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఎక్కువ తీపి కావాలంటే, పైన పంచదారను చల్లుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ.. 

Tags: vairaty purnalu easy preparation

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top