logo

347/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన కోహ్లీ సేన


23-Nov-2019 18:57IST
kohli Sena who declared their first innings at 3479

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌,భారత్ జట్ల మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత్ 347/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ స్కోరు 174/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆటగాళ్లు దూకుడిని ప్రదర్శించి బంగ్లాదేశ్‌పై 241 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ క్రమంలో మొదటగా బరిలోకి దిగిన మయాంక్‌(14) వద్ద వికెట్‌ను చేజార్చుకోగా, ఆపై రోహిత్‌ శర్మ(21) కూడా పెవిలియన్‌ చేరాడు. ఆ తరువాత బరిలోకి దిగిన రహానే (51) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత తైజుల్ ఇస్లాంకు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్ అందుకొని గ్రౌండ్ లోకి దిగిన కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన టెస్టుల్లో 27వ సెంచరీ పూర్తి చేసుకుని రికార్డుని సాధించాడు. 

రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. 12 పరుగులు చేసి అబు జాయెద్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పటి నుండి వికెట్ల పతనం ప్రారంభమైంది. 136 పరుగులు చేసిన కోహ్లీ ఆరో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత వికెట్లు వరుసగా రాలిపోయాయి. అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ సిక్సర్, ఫోర్‌తో పది పరుగులు చేశాడు. ఆ వెంటనే కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ హొసైన్, ఇబాదత్ హొసైన్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అబు జాయెద్ రెండు, తైజుల్ ఇస్లాం ఓ వికెట్ పడగొట్టాడు.


Ind vs Ban: Team India Looks Stay On Innings Victory - Sakshi

Tags: india V/S bangladesh kohli Sena declared first innings at 347/9

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top