logo

బంగ్లా టీం కు చుక్కలు చూపించిన భారత్ బౌలర్లు


24-Nov-2019 01:55IST
india bowlers showing stars for bangla team

ఈడెన్ గార్డెన్ వేదికగా కొనసాగుతున్న డే/నైట్ టెస్ట్ లో కోహ్లీసేన తన సత్తా ఏంటో మరో సారి నిరూపించింది. తాజాగా జరుగుతున్న రెండో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. ఆట ముగిసే సమయానికి బంగ్లా 6 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం 59 పరుగులతో బ్యాటింగ్ లో కొనసాగుతున్నాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన మహ్మదుల్లా (39 పరుగులు) రేపు తిరిగి బ్యాటింగ్ కు దిగే అవకాశముంది. ఇప్పటికి భారత్ కన్నా బంగ్లా ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది. 

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 174/3 పరుగులతో ఆటను కొనసాగించిన భారత్, తొలి ఇన్నింగ్స్ ను భారత  టీం కెప్టెన్ కోహ్లీ 9 వికెట్ల నష్టానికి 347 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ కోహ్లీ డే/నైట్ టెస్ట్ చరిత్రలో భారత తరపున సెంచరీ చేసిన తొలి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. కాగా, పుజారా, అజింక్య రహానేలు అర్ధ శతకాలతో రాణించారు. రెండో రోజు జరుగుతున్న ఈ ఇన్నింగ్స్ లో  ముఖ్యంగా పేసర్ ఇషాంత్ శర్మ వేగవంతమైన బంతులతో బంగ్లా బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. మొత్తం 39 పరుగులిచ్చి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకోగా, మరో పేసర్ ఉమేష్ యాదవ్ 40 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు.


Tags: india V/sbangladesh teamindia bowlers showing stars bangla team

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top